Singareni: సింగరేణి సమావేశానికి నన్ను ఎందుకు పిలవలేదు?: కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు మండిపాటు

  • ఈ సమావేశం రిసార్ట్ లో నిర్వహించాల్సిన అవసరమేంటి?
  • మంత్రి కొప్పుల మా హక్కులు కాలరాస్తున్నారు
  • సింగరేణి అధికారులకు, సీఎండీకి నోటీసులు ఇస్తా

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణికి సంబంధించిన సమావేశాన్ని రిసార్ట్ లో నిర్వహించాల్సిన అవసరమేంటి? ఈ సమావేశానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నన్ను ఎందుకు పిలవలేదు? అని ప్రశ్నించారు. సింగరేణి అధికారులకు, సీఎండీకి నోటీసులు ఇస్తానని అన్నారు.

కొప్పుల ఈశ్వర్ తమ హక్కులను కాలరాస్తున్నారని, ఈ విషయమై స్పీకర్ కు సభా హక్కుల నోటీసులు ఇస్తానని చెప్పారు. ప్రభుత్వానికి తనపై వ్యక్తిగతంగా కోపం ఉంటే ఉండొచ్చు కానీ, ఇలా సమావేశానికి పిలవకుండా చేయడం తగదని, దీనికి గల కారణం ఏంటో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి సీఎండీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తనను పిలవలేదా అని ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం లేదా తమ ప్రాంతానికి చెందిన మంత్రి, లేకుంటే, సీఎం తమ ప్రాంతం పట్ల చిన్నచూపు చూస్తున్నట్టు అర్థమవుతోందని అన్నారు.

More Telugu News