Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ కి రేపు స్పెషల్ సర్ ప్రైజ్

  • త్రివిక్రమ్ మూవీ నుంచి మూడో సాంగ్
  • సాంగ్ టీజర్ తో కలిపి మరో గిఫ్ట్ 
  • జనవరి 12వ తేదీన సినిమా విడుదల

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటికి వచ్చి, ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి.  'చిల్డ్రన్స్ డే' సందర్భాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుంచి 3వ సాంగ్ టీజర్ ను వదలనున్నారు. 'ఓ మై గాడ్ డాడీ' అంటూ ఈ సాంగ్ టీజర్ సాగనుంది.

ఈ సాంగ్ టీజర్లో ఇద్దరు స్పెషల్ గెస్టులు కనిపించి సర్ ప్రైజ్ చేస్తారనే విషయాన్ని పోస్టర్ ద్వారా తెలియజేశారు. బన్నీ ఇద్దరు పిల్లలకి సంబంధించిన వీడియో బైట్ పై ఈ సాంగ్ ను రన్ చేస్తారనేది సన్నిహితుల మాట. తన పిల్లలపై చిన్న చిన్న వీడియోలు చేసి వదలడం బన్నీకి అలవాటే. అందువలన ఈ సాంగ్ టీజర్లో ఆయన పిల్లలిద్దరూ కనిపిస్తారనే విషయం నిజమే అయ్యుండొచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News