హై ఓల్టేజ్ 'యాక్షన్'తో సిద్ధమైపోయిన విశాల్

Wed, Nov 13, 2019, 04:13 PM
  • సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'యాక్షన్'
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న సంగీతం 
  •  ఈ నెల 15న రెండు భాషల్లో విడుదల   
సుందర్ సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా 'యాక్షన్' సినిమా రూపొందింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

2గంటల 37 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఆశ్చర్యచకితులను చేస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. హిపాప్ తమిజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. తమిళంలో మాదిరిగానే తెలుగులోను విశాల్ కి మాస్ ఫాలోయింగ్ వుంది. ఈ సినిమా ఇక్కడ ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement