యంగ్ హీరో సినిమా కోసం భారీ స్టేడియం అద్దెకి తీసుకున్నారట!

Wed, Nov 13, 2019, 03:49 PM
  • స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ 
  • హాకీ ప్లేయర్ గా సందీప్ కిషన్
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్ 
తెలుగులో సందీప్ కిషన్ యువ కథానాయకులతో పోటీపడుతూ ముందుకు వెళుతున్నాడు. ఒక సినిమాకి .. మరో సినిమాకి ఎలాంటి పోలిక లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజాగా ఆయన చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఆయన 'A1 ఎక్స్ ప్రెస్' చేయనున్నాడు.

డెన్నీస్ జీవన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో, సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. కథానాయిక అయిన లావణ్య త్రిపాఠి కూడా హాకీ ప్లేయర్ పాత్రనే చేస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఈ షూటింగ్ కోసం హైదరాబాద్ లోని ఒక పెద్ద స్టేడియం అద్దెకి తీసుకున్నారట. హాకీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నింటినీ ఇక్కడే చిత్రీకరించనున్నారని సమాచారం. ఆ తరువాతనే ఇతర సన్నివేశాల కోసం వేరే లొకేషన్స్ కి వెళతారట. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై సందీప్ కిషన్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha