Venkaiah Naidu: వెంకయ్య నాయుడు గారిని విమర్శించడం విడ్డూరం: వైసీపీపై సోమిరెడ్డి విమర్శలు

  • తెలుగు భాష, ఉపన్యాసాలంటే ప్రపంచమంతా గుర్తుకు వచ్చేది వెంకయ్య
  • చిన్నప్పుడు 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ప్రభుత్వ స్కూలులో చదివారు
  • ఆయనను చూసి నేర్చుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తారా? 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను తొలగించి, పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు  వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వారిపై ముఖ్యమంత్రి జగన్‌ విరుచుకుపడుతూ... 'ఇవే మాటలు మాట్లాడుతున్న వెంకయ్య నాయుడును నేను ఓ విషయం అడుగుతున్నాను. అయ్యా వెంకయ్య గారూ.. మీ కుమారుడు చదివింది ఏ మీడియం? మీ మనవళ్లు చదువుతున్నది ఏ మీడియం?' అని ప్రశ్నించారు. అయితే, వైసీపీ చేస్తోన్న విమర్శలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్పందించారు.

'తెలుగు భాష, యాస, ప్రాస, సంస్కృతి, ఉపన్యాసాలంటే ప్రపంచమంతా గుర్తుకు వచ్చేది ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. చిన్నప్పుడు మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ప్రభుత్వ స్కూలులో తెలుగులో చదువుకుని, ఇప్పుడు ఉపరాష్ట్రపతి స్థాయికి వచ్చిన ఆయనను చూసి నేర్చుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తారా? మాతృభాష విలువ తెలియని వ్యక్తులు వెంకయ్య నాయుడు గారిని విమర్శించడం విడ్డూరం' అని సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ట్వీట్లు చేశారు.

More Telugu News