మళ్లీ 'బంగార్రాజు'ను పక్కన పెట్టిన నాగార్జున

Wed, Nov 13, 2019, 12:52 PM
  • 'బంగార్రాజు' చేయాలనుకున్న నాగ్ 
  • అనివార్య కారణాల వలన ఆలస్యం 
  • కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన నాగ్
నాగార్జున కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మన్మథుడు 2' .. ఆయన అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. 'బిగ్ బాస్ 3'కి హోస్ట్ గా వ్యవహరించడం కోసం కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, ఆ షో పూర్తి కావడంతో తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.

నాగార్జున తదుపరి సినిమా 'బంగార్రాజు' అనే చాలామంది అనుకున్నారు. కానీ ఆ కథను మరోసారి పక్కన పెట్టినట్టు సమాచారం. ఈ ఆలస్యం వెనుక దర్శకుడు కల్యాణ్ కృష్ణ వ్యక్తిగత కారణాలు కూడా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే నాగ్ మరో కథను చేయనున్నట్టుగా తెలుస్తోంది. కొత్త దర్శకుడు వినిపించిన కథ బాగా నచ్చడంతో, ఆ కథను చేయడానికి నాగ్ రెడీ అవుతున్నాడట. మ్యాట్నీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడనుందని అంటున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha