'సరిలేరు నీకెవ్వరు'లోనూ హైలైట్ గా నిలిచే ఫ్రెండ్ రోల్

Wed, Nov 13, 2019, 12:01 PM
  • ముగింపు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
  • ముఖ్యమైన పాత్రలో సత్యదేవ్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
'మహర్షి' సినిమా మహేశ్ బాబు కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రను 'అల్లరి' నరేశ్ చేశాడు. ఈ పాత్ర ద్వారానే కథ కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోను హీరో స్నేహితుడి పాత్ర హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ పాత్రలో 'సత్యదేవ్' కనిపించనున్నట్టు చెబుతున్నారు.

'జ్యోతిలక్ష్మి' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, ఆ తరువాత పలు చిత్రాలలో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఆయన పాత్ర కారణంగానే 'సరిలేరు నీకెవ్వరు' కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాతో సత్యదేవ్ మరింత బిజీ అవుతాడనే టాక్ కూడా వినిపిస్తోంది. రష్మిక  మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి వుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad