తెలుగు ప్రేక్షకుల ముందుకు మలయాళ హిట్ మూవీ

- మలయాళంలో హిట్ కొట్టిన 'మధుర రాజా'
- తెలుగు టైటిల్ గా 'రాజా నరసింహా'
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
అలాంటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో 'రాజా నరసింహా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. ముమ్ముట్టి సరసన కథానాయికగా అనుశ్రీ నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. 'జై' ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను ఇక్కడ విడుదల చేయనున్నారు. ఇక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.