Dhanush: ధనుశ్ మూవీ విడుదల తేదీ ఖరారు

  • గౌతమ్ మీనన్ నుంచి కొత్త సినిమా 
  • ధనుశ్ జోడీ కట్టిన మేఘా ఆకాశ్ 
  • కీలకమైన పాత్రలో రానా 

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుశ్ 'ఎన్నై నోకి పాయుమ్ తూటా' అనే సినిమా చేశాడు. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. అలాంటి ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 29వ తేదీన తమిళనాట ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇటీవల ధనుశ్ చేసిన 'అసురన్' రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది. ఆ సినిమా ప్రభావం సహజంగానే తదుపరి సినిమాపై ఉంటుంది. అందువలన గౌతమ్ మీనన్ 'ఎన్నై నోకి పాయుమ్ తూటా' సినిమాను రంగంలోకి దింపుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి. మేఘా ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో రానా కనిపించనున్నాడు.

More Telugu News