Maharashtra: 'మహా' రాజకీయంపై మీ చాయిస్ ఏంటి?... ఫాలోవర్లకు ప్రకాశ్ రాజ్ మూడు ఆప్షన్లు!

  • ప్రజాస్వామ్యంలో రాజకీయాల నృత్యం
  • ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్ పోల్
  • నెటిజన్ల మిశ్రమ స్పందన

ప్రజాస్వామ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు డ్యాన్స్ చేస్తున్నాయని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ఫ్యాన్స్ ను, ఫాలోవర్లను సమాధానం కోరారు. మహారాష్ట్రపై మీ చాయిస్ ఏంటని అడుగుతూ మూడు ఆప్షన్లు ఇచ్చారు. బీజేపీ పాలన, బీజేపీతో కూడిన పాలన, గవర్నర్ సాయంతో బీజేపీ పాలన... సమాధానం చెప్పాలని కోరారు. ఇక ఈ పోల్ కు మిశ్రమ స్పందన వస్తోంది. సమాధానం ఏదయినా బీజేపీదే పరిపాలనని అంటున్నారు.

More Telugu News