Balwant singh rajona: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి హత్యకేసు దోషికి ఊరట

  • 1995లో చండీగడ్ సచివాలయం వద్ద భారీ పేలుడు
  • బియాంత్‌సింగ్ సహా 17 మంది మృతి
  • 2007లో బల్వంత్‌సింగ్‌కు మరణశిక్ష

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్యకేసులో దోషి బల్వంత్‌సింగ్ రాజోనాకు ఊరట లభించింది. ఆగస్టు 31, 1995లో చండీగఢ్ సచివాలయం ఎదుట జరిగిన భారీ పేలుడులో బియాంత్‌సింగ్ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో దోషిగా తేలిన బల్వంత్‌సింగ్‌కు 2007లో కోర్టు మరణశిక్ష విధించింది. తాజాగా, కేంద్ర హోంశాఖ అతడి మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News