Vishal: ఇంతవరకూ ఇలాంటి పాత్ర చేయలేదు: తమన్నా

  • తెలుగు .. తమిళ భాషల్లో 'యాక్షన్'
  • ఎల్లుండి రెండు భాషల్లోను విడుదల 
  • కమెండో గా కనిపిస్తానంటున్న తమన్నా 

తెలుగు .. తమిళ భాషల్లో ఆ మధ్య తమన్నా బాగా వెనుకబడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమెను 'ఎఫ్ 2' సినిమా ఆదుకుంది. అప్పటి నుంచి ఈ రెండు భాషల్లోని చిత్రాల్లో ఆమె మళ్లీ కనిపిస్తోంది. ఇటీవల తెలుగులో విడుదలైన 'సైరా' ఆమెకి మరింత ఊతాన్నిచ్చింది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'యాక్షన్', తెలుగు .. తమిళ భాషల్లో ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. 'యాక్షన్' సినిమాలో విశాల్ జోడీగా నటించాను. ఆయనతో పాటు నేను కూడా కమెండో ఆఫీసర్ గానే చేశాను. ఈ సినిమాలో నేను యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ లోను కనిపిస్తాను. ఈ తరహా పాత్రను చేయడం థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇక ఫైట్లు మాత్రమే కాదు .. విశాల్ కి నాకూ మధ్య రొమాంటిక్ సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా వుంటాయి. సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమా, నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.

More Telugu News