Hyderabad: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మేనమామ కారు చోరీ... వేములవాడ సమీపంలో వదిలెళ్లిన చోరులు!

  • జూబ్లీహిల్స్ లోని ఇంటి నుంచి దొంగతనం
  • వేములవాడ సమీపంలో వదిలెళ్లిన దొంగలు
  • కారును గుర్తించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మేనమామ ప్రభాకర్ రెడ్డి కారును, ఆయన ఇంటి ముందు నుంచే దొంగిలించుకుపోయారు. ఈ ఘటన హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 78లో జరిగింది. తన ఫార్చ్యూనర్‌ కారును సాయంత్రం ఇంటి ఎదుట పార్కింగ్‌ లో పెట్టి, దాని తాళాన్ని ఇంటి బయట కొక్కానికి తగిలించడం ప్రభాకర్ రెడ్డికి అలవాటు. దీన్ని గమనించిన ఓ చోరుడు అర్ధరాత్రి కారును తీసుకెళ్లిపోయాడు. ఉదయం లేచి చూసేసరికి కారు కనిపించకపోవడంతో ప్రభాకర్‌ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.

ఇదే సమయంలో వేములవాడ సమీపంలోని నాంపల్లి గుట్ట సమీపంలో తన ఇంటికి అడ్డంగా ఉన్న ఫార్చ్యూనర్‌ కారుపై అనుమానంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు కబురు చేశారు. వారు వచ్చి టయోటా కంపెనీలకు సమాచారం ఇవ్వగా, ఆ కారు ప్రభాకర్ రెడ్డిదేనని తేలింది. దీంతో కారును స్వాధీనం చేసుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు  వేములవాడకు బయలుదేరి వెళ్లారు.

More Telugu News