: విద్యుత్ ఛార్జీలపై పార్టీల వైఖరి తెలపాలి: సీపీఎమ్ రాఘవులు

పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటే రాజకీయ పార్టీలు ఏమీ పట్టనట్టే చూస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. పెంచిన ఛార్జీలపై పార్టీలన్నీ తమ వైఖరి స్పష్టం చేయాలన్న ఆయన, ప్రజలను మోసపుచ్చే ధోరణిలో పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవా? అని ప్రశ్నించిన రాఘవులు, పార్టీలు సొంతలాభం మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. లేకపోతే ప్రజల నుంచి ఏమాత్రం సానుభూతి పొందలేరని హెచ్చరించారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవులు ఈ మేరకు మాట్లాడారు.

More Telugu News