దేశంలో ఎక్కడ చూసినా బీజేపీ జెండాలే ఎగురుతున్నాయి: లక్ష్మణ్

- సిద్ధిపేటలో బీజేపీ ఆఫీసుకు భూమిపూజ
- హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
- దేశంలో బీజేపీ హవా కొనసాగుతోందని వ్యాఖ్యలు
కేవలం ఆరేళ్ల వ్యవధిలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని కొనియాడారు. కేంద్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా అభివృద్ధి సాధించలేకపోయాయని విమర్శించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, అయోధ్య వివాదం వంటి దీర్ఘకాల సమస్యలను మోదీ అవలీలగా పరిష్కరించగలిగారని కితాబిచ్చారు.