Narendra Modi: బ్రెజిల్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

  • బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొననున్న ప్రధాని
  • నవంబరు 13, 14 తేదీల్లో బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సదస్సు
  • సంబంధాల బలోపేతం కోసం కృషి చేస్తానన్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. బ్రెజిల్ ఆతిథ్యమిస్తున్న 11 బ్రిక్స్ దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. బ్రెజిల్ పర్యటనలో భాగంగా మోదీ చైనా, రష్యా, బ్రెజిల్ దేశాధినేతలతో భేటీ కానున్నారు. తన విదేశీ పర్యటనకు ముందు మోదీ ట్విట్టర్ లో స్పందించారు. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారోతో చర్చలు జరుపుతానని, భారత్-బ్రెజిల్ దేశాల మధ్య ప్రగాఢ వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పేందుకు తన పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నానని తెలిపారు. వాణిజ్యం, రక్షణ రంగం, వ్యవసాయం, ఇంధన రంగాల్లో మరింత అభివృద్ధికి తన పర్యటన ఊతమిస్తుందని పేర్కొన్నారు.

బ్రిక్స్ దేశాల సదస్సు గురించి వివరిస్తూ, నవంబరు 13, 14 తేదీల్లో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్నానని, సరికొత్త భవిష్యత్ కోసం ఆర్థిక అభివృద్ధి అనే అంశంపై సదస్సు జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా తాను బ్రిక్స్ వాణిజ్య మండలితోనూ, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్, బ్రిక్స్ బిజినెస్ ఫోరంతోనూ చర్చలు జరుపుతానని ట్వీట్ చేశారు.

More Telugu News