Maharashtra: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర

  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీ, శివసేన, ఎన్సీపీ
  • రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసిన గవర్నర్
  • కేంద్ర కేబినెట్ ఆమోదంతో అమల్లోకి రానున్న రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు ఊహించిన విధంగానే శుభం కార్డ్ పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ, శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ... ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్సీపీకి ఈ రాత్రి 8.30 వరకు గడువు ఉన్నప్పటికీ... ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడకపోవడంతో... రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు. గవర్నర్ సిఫారసును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది.

More Telugu News