కీళ్ల నొప్పులకు మాత్రలు వేసుకుంటున్నారా?.. జాగ్రత్త అంటోన్న పరిశోధకులు

Tue, Nov 12, 2019, 02:18 PM
  • శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు 
  • దీర్ఘకాలంలో నొప్పిపై ప్రభావం చూపని మాత్రలు
  • వ్యాయామం చేయాలంటోన్న పరిశోధకులు
కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కోసం చాలా మంది అలోపతీ మాత్రలు వేసుకుంటారు. అయితే, ఇలా మాత్రలు వేసుకోవడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేగాక, శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతాయని తేల్చారు. ఈ మాత్రలు దీర్ఘకాలంలో నొప్పిపై ప్రభావం చూపవని గుర్తించారు.

దాదాపు 12,000  మందిపై అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు. అత్యవసరమైతే ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. కీళ్లనొప్పులు ఉన్నవారు మాత్రల జోలికి వెళ్లడం మానేసి.. వ్యాయామం చేయడం, కాపడం పెట్టుకోవడం లాంటి వాటితో ఉపశమనం పొందొచ్చని, నొప్పి నివారణకు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement