'అల్లరి' నరేశ్ హీరోగా కొత్త సినిమా 

Tue, Nov 12, 2019, 01:22 PM
  • 'బంగారు బుల్లోడు'తో బిజీగా అల్లరి నరేశ్
  • కొత్త దర్శకుడితో తదుపరి సినిమా
  • త్వరలో పూర్తి వివరాలు  
రాజేంద్రప్రసాద్ తరువాత తెలుగు తెరపై ఆ స్థాయి కామెడీని పరుగులు తీయించిన హాస్య కథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ కనిపిస్తాడు. కామెడీ హీరోగా చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేసిన 'అల్లరి' నరేశ్, ఈ మధ్య వచ్చిన 'మహర్షి'లో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఇక ప్రస్తుతం హీరోగా ఆయన 'బంగారు బుల్లోడు' చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన మరో సినిమాను అంగీకరించాడు.

విజయ్ కనకమేడల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, సతీశ్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎస్ వీ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానున్నట్టు తాజాగా ప్రకటించారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement