నాకు అన్నీ మా నాన్నే .. నా బర్త్ డే రోజునే ఆయన పోయారు: సీనియర్ హీరోయిన్ రాశి

- మా నాన్నంటే నాకు చాలా ఇష్టం
- నేను హీరోయిన్ కావాలనేది ఆయన కోరికే
- అందుకే బర్త్ డే జరుపుకోనన్న రాశి
ఆ రోజున నేను ఊటీలో వున్నాను .. విజయకాంత్ తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ రోజున నా పుట్టినరోజు కావడంతో, యూనిట్ సభ్యులు కేక్ కటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందురోజు రాత్రి నాన్న కాల్ చేయలేదు .. ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తున్నాను. మనసు ఏదో కీడు శంకిస్తోంది. అంతలో మా అన్నయ్యకి కాల్ వచ్చింది. ఆయన కాల్ మాట్లాడేసి .. 'నాన్న చనిపోయారట' అన్నాడు. అంతే.. ఆ షాక్ నుంచి నేను తేరుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ నేను బర్త్ డే జరుపుకో లేదు" అని చెప్పుకొచ్చారు.