Sensex: ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు.. ఐటీకి నష్టాలు, బ్యాంకులకు లాభాలు

  • 21 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 5 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతం వరకు లాభపడ్డ యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. మధ్యాహ్నం సమయంలో దాదాపు 160 పాయింట్ల వరకు సెన్సెక్స్ నష్టపోయినప్పటికీ... చివరకు పుంజుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 40,345కి చేరింది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 11,913 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, టెలికాం, ఫైనాన్స్, రియాల్టీ తదితర సూచీలు లాభపడగా... ఐటీ, ఎనర్జీ, ఆటో తదితర సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (5.80%), టాటా మోటార్స్ (1.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.53%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.50%), యాక్సిస్ బ్యాంక్ (1.12%).

టాప్ లూజర్స్:
హీరో మోటో కార్ప్ (-2.00%), వేదాంత లిమిటెడ్ (-1.90%), టీసీఎస్ (-1.42%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.21%), ఏసియన్ పెయింట్స్ (-1.09%).

More Telugu News