సింగిల్స్ డే సందర్భంగా 'సోలో బ్రతుకే సో బెటర్' నుంచి కొత్త పోస్టర్

Mon, Nov 11, 2019, 03:23 PM
  • దర్శకుడిగా సుబ్బు పరిచయం 
  • తేజు జోడీగా నభా నటేశ్ 
  • వచ్చే వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ 
మొదటి నుంచి కూడా యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చిన సాయిధరమ్ తేజ్, వరుస పరాజయాలు ఎదురవడంతో, ఆ తరువాత కథల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నాడు. అలా రూపొందుతున్న 'ప్రతిరోజూ పండగే' సినిమా వచ్చేనెల 20వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత సినిమాను కూడా ఆయన లైన్లో పెట్టేశాడు.

ఈ సారి యూత్ కి సంబంధించిన అంశాలు కాస్తంత ఎక్కువగా వుండేలా చూసుకుని, 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా చేస్తున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో, తేజు జోడీగా నభా నటేశ్ నటించనుంది. 'హ్యాపీ సింగిల్స్ డే' అంటూ ఈ సినిమా నుంచి తేజు ఒక పోస్టర్ వదిలాడు. ఈ పోస్టర్ లో స్టైలిష్ లుక్ తో ఆయన కనిపిస్తున్నాడు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బహుశా వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad