Aadhar: ఆధార్ కార్డులో మార్పులు చేర్పులకు పరిమితి విధించిన కేంద్రం

  • ఆధార్ అప్ డేట్లపై కోత
  • సదుపాయం దుర్వినియోగం అవుతోందంటున్న కేంద్రం
  • ఫిర్యాదుల నేపథ్యంలో తాజా నిర్ణయం

విశిష్ట గుర్తింపు సంఖ్య 'ఆధార్' లో మార్పులు చేర్పుల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పేరు, పుట్టినరోజు తేదీలు, ఇతర తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి పరిమితి లేదు. ఎవరు, ఎన్నిసార్లైనా అప్ డేట్ చేసుకునే వీలుండేది. అయితే ఈ సదుపాయం దుర్వినియోగం అవుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (ఉడాయ్) కొత్తగా నిబంధనలు ప్రవేశపెట్టింది.

 దీని ప్రకారం, నిర్దేశించిన మేరకు మాత్రమే మార్పులు చేర్పులు చేసుకునే వీలుంటుంది. కొత్త నియమావళి ప్రకారం.... పేరును సరిచేసుకోవడానికి రెండు అవకాశాలు మాత్రమే ఇస్తారు. పుట్టినరోజు తేదీలు, లింగం మార్చుకోవాల్సి వస్తే ఒక్కసారే అవకాశం ఉంటుంది. ఒకవేళ సూచించిన మేర కంటే ఎక్కువసార్లు మార్పులు చేసుకోవాల్సి వస్తే సమీప ఆధార్ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులకు తగిన కారణాలు వివరించాలి. మార్పులు చేర్పులకు సంబంధించిన ఆధారాలను పోస్టు ద్వారా, లేకపోతే ఈ-మెయిల్ ద్వారా అధికారులకు పంపాలి.

More Telugu News