నవ్వించడమే ప్రధాన ఉద్దేశంగా 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' తీశాను: దర్శకుడు నాగేశ్వర రెడ్డి

11-11-2019 Mon 14:42
  • హాస్య చిత్రాల దర్శకుడిగా నాగేశ్వరరెడ్డి 
  • పూర్తి హాస్య చిత్రంగా 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' 
  • ఈ నెల 15వ తేదీన భారీస్థాయి రిలీజ్
హాస్యభరితమైన కథలను తెరకెక్కించడంలో దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి సిద్ధహస్తుడు. ఈ సారి కూడా ఆయన ఒక వినోదభరితమైన కథను తెరపై ఆవిష్కరించడానికి సిద్ధమైపోతున్నాడు. ఆయన రూపొందించిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ఈ నెల 15వ తేదీన విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, "నానా రకాల సమస్యలతో అందరూ సతమతమైపోతున్నారు. అలాంటి వాళ్లందరినీ కాసేపు నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాను. ఈ మధ్య కాలంలో పూర్తిస్థాయి కామెడీ మూవీ రాలేదు. నేను ఈ సినిమాను తీయడానికి అది కూడా ఒక కారణం. పూర్వ కాలంనాటి తెనాలి రామకృష్ణుడికి .. ఈ కథలోని హీరోకి చాలా దగ్గర లక్షణాలు ఉంటాయి. అందువల్లనే ఈ పేరు పెట్టడం జరిగింది. హన్సిక .. పోసాని .. వెన్నెల కిషోర్ .. సప్తగిరి పాత్రలు కూడా నాన్ స్టాప్ గా నవ్విస్తాయి" అని చెప్పుకొచ్చారు.