vehicles: వాహన విక్రయాలు పెరిగాయి: ఆటోమొబైల్‌ రంగానికి ఊరటనిచ్చే వార్త చెప్పిన ఎస్‌ఐఏఎం

  • ఆర్థిక మందగమన పరిస్థితులతో కొన్ని నెలలుగా పడిపోయిన అమ్మకాలు
  • ఊరటనిచ్చిన పండుగ సేల్స్
  • గత ఏడాది అక్టోబర్‌లో 2,84,223 వాహనాల విక్రయం 
  • ఈ ఏడాది అక్టోబర్‌లో 2,85,027 వాహనాల విక్రయం

దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులతో వాహన విక్రయాలు తగ్గిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆటోమొబైల్‌ రంగం కుదేలైపోయింది. అయితే, దసరా, దీపావళి పండుగ సేల్స్‌ లో మాత్రం ఆ రంగానికి ఊరట లభించింది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌ సొసైటీ (ఎస్‌ఐఏఎం) తాజాగా వాహన అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. ఎస్‌ఐఏఎం ప్రకారం గత నెలలో భారత్ లో వాహన విక్రయాలు 0.28 శాతం పెరిగాయి.

గత ఏడాది అక్టోబర్‌లో 2,84,223 వాహనాలు విక్రయం జరగగా ఈ ఏడాది అక్టోబర్‌లో 2,85,027 వాహనాలు అమ్ముడయ్యాయని ఎస్‌ఐఏఎం వివరించింది. గత కొన్ని నెలలుగా వాహన అమ్మకాలు గణనీయంగా పడిపోతుండడంతో గత నెలలో కంపెనీలు వాహనాల ఉత్పత్తిని 21.14 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. కాగా, గత నెలలో ఎగుమతులు మాత్రం 2.18 శాతం పడిపోయాయి.

More Telugu News