Asaduddin Owaisi: అయోధ్య తీర్పుపై మరోమారు అసంతృప్తిని వెళ్లగక్కిన అసదుద్దీన్ ఒవైసీ

  • బాబ్రీ మసీదు నా హక్కు
  • నా పోరాటం మసీదు కోసమే
  • మేమేమీ బిచ్చగాళ్లం కాదు

అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోమారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా దారుస్సలాంలో నిర్వహించిన బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు తనకున్న చట్టపరమైన హక్కు అని అన్నారు. తన పోరాటం మసీదు కోసమేనని, భూమి కోసం కాదని స్పష్టం చేశారు. తాము బిచ్చగాళ్లం కాదన్నారు.

ఎవరైనా మన ఇల్లును కూల్చివేసినప్పుడు మధ్యవర్తి వద్దకు వెళ్తే, కూల్చేసిన వారికే ఆయన ఆ స్థలాన్ని ఇచ్చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇంటిని కోల్పోయిన మీకు వేరే చోట స్థలాన్ని ఇస్తే మీకెలా అనిపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమను అవమానించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కట్టడమే చట్ట విరుద్ధమని ప్రచారం చేస్తున్నారని, అటువంటప్పుడు దానిని కూల్చేసిన ఘటనపై అద్వానీపై చార్జిషీటు ఎందుకు దాఖలు చేశారని, ఎందుకు విచారణ జరపాల్సి వచ్చిందో చెప్పాలని అసద్ నిలదీశారు.

More Telugu News