Ayodhya: అయోధ్య రామాలయం కోసం విరాళాలు మొదలు... రూ. 10 కోట్లు ప్రకటించిన హనుమాన్ మందిర్!

  • రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్
  • పట్నాలోని హనుమాన్ మందిర్ కమిటీ భారీ విరాళం
  • ఓ అన్నదాన భవనాన్ని నిర్మిస్తామని వెల్లడి

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ చేస్తూ, సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో, ఆలయ నిర్మాణ ఖర్చుల నిమిత్తం భారీ ఎత్తున విరాళాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియాలోనే అద్భుత రీతిలో నిర్మితంకానున్న ఈ ఆలయం కోసం ఇప్పటికే కోట్లాది ఇటుకలు, వందలాది రాతి స్తంభాలు సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఇక ఆలయం కోసం బీహార్‌ రాజధాని పట్నాలో ఉన్న హనుమాన్ మందిర్ ఏకంగా రూ. 10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆలయ కమిటీ, అధ్యక్షుడు కిశోర్ కుమార్ ఓ ప్రకటన చేస్తూ, ఆలయానికి ఏటా రూ. 2 కోట్లు అందిస్తామని, పనులు త్వరగా జరుగుతూ, ఆలయ నిర్మాణం ఇంకా ముందే పూర్తవుతుందని భావిస్తే, ఈలోగానే మొత్తం ఇస్తామని అన్నారు. అయోధ్యలో ఓ అన్నదాన భవనాన్ని సైతం తాము నిర్మిస్తామని పేర్కొన్నారు.

More Telugu News