snow: మేఘాల్లో మంచు పుట్టుక గుట్టును ఛేదించిన శాస్త్రవేత్తలు

  • నిట్ట నిలువు గాలులే మంచు పుట్టుకకు కారణం
  • మిశ్రమ దశ మేఘాలు ఎంత ఎక్కువగా కుదుపునకు గురైతే అంత ఎక్కువ మంచు
  • జర్మనీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

మేఘాల్లో మంచు పుట్టుకపై ఇన్నాళ్లూ మిస్టరీగా మారిన గుట్టును శాస్త్రవేత్తలు విప్పేశారు. ఈ విషయాన్ని తేల్చేందుకు పరిశోధన ప్రారంభించిన జర్మనీలోని ‘లీబ్నిజ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రోపోఫెరిక్ రీసెర్చ్’ శాస్త్రవేత్తలు.. నిట్టనిలువు గాలులే మంచు పుట్టుకకు కారణమని తేల్చారు. మేఘాల్లో నీటి ఆవిరితోపాటు మంచు కణాలు, చల్లని ద్రవరూప సూక్ష్మబిందువులు, వేడి-చల్లని గాలి కలిసి ఉంటాయి. ఇలా కలిసి ఉండే మేఘాలను ‘మిశ్రమ దశ మేఘాలు’గా పిలుస్తారు.

సాంద్రత తక్కువగా ఉండే వేడిగాలి పైకి వెళ్లే క్రమంలో ఈ మిశ్రమ దశ మేఘాలు కుదుపులకు గురవుతాయి. ఈ క్రమంలో మంచుకణాలు కలిసిపోయి మంచు తయారవుతున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. మంచు తయారీకి నిట్టనిలువుగా కుదిపేసే గాలులే కారణమని స్పష్టం చేశారు. ఈ గాలులు ఎంత ఎక్కువగా కుదిపేస్తే అంత ఎక్కువ మొత్తంలో మంచు తయారవుతుందని, లేజర్, రాడార్ టెక్నాలజీతో ఈ అధ్యయనం నిర్వహించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

More Telugu News