Bulbul: బుల్ బుల్ విలయం.... మమతకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ

  • తీరం దాటిన బుల్ బుల్
  • సాగర్ ఐలాండ్ వద్ద భూభాగంపైకి పయనం
  • ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై బుల్ బుల్ తీవ్ర ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుపాను తీరం దాటింది. పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్ సమీపంలో తీరం దాటిన బుల్ బుల్ ఆపై క్రమంగా బలహీనపడి బంగ్లాదేశ్ వైపు పయనించింది. అయితే ఈ తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. కుండపోత వర్షాలకు తోడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు ఈ రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు తుపాను ప్రభావాన్ని చవిచూశారు. ఇప్పటివరకు 9 మంది మరణించారు.

బుల్ బుల్ ప్రభావం నేపథ్యంలో, రాజకీయ విభేదాలన్నీ పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. తుపాను కారణంగా జరిగిన నష్టం వివరాలను మమతను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మమతా ఇవాళ మొత్తం కంట్రోల్ రూమ్ లోనే ఉండి అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షించారు.

More Telugu News