names: పాప పుడితే సుబ్బమ్మ.. బాబు పుడితే గోపాలరావు, సుబ్బినాయుడు పేర్లే పెడుతోన్న గ్రామస్థులు

  • తూర్పు గోదావరి జిల్లా జోగింపేట గ్రామంలో గ్రామస్థుల ఆచారం
  • గ్రామ దేవత సుబ్బమ్మ పేరంటాలు పేరిట పేరు
  • వందల ఏళ్ల నుంచి ఈ గ్రామంలో తొలి సంతానానికి ఇవే పేర్లు

సాధారణంగా పిల్లలకు ఏ పేర్లు పెట్టాలన్న విషయంపై చాలా ఆలోచిస్తారు తల్లిదండ్రులు. కొందరు తమ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకుంటే, మరికొందరు జాతక దృష్ట్యా ఏ పేరు పెడితే మంచిదో ఆ పేరు పెడతారు. అయితే, ఓ గ్రామంలోని ప్రతి ఇంట్లో కనీసం ఒకరి పేరు సుబ్బమ్మ లేదా గోపాలరావు, సుబ్బినాయుడుగా ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామంలోని ఏ కుటుంబంలోనైనా సరే తమ తొలి సంతానానికి ఈ పేరే పెడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని జోగింపేట గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామ దేవత సుబ్బమ్మ పేరంటాలు. దీంతో ఇక్కడి ఆచారాలు ఇలా కొనసాగుతున్నాయి. వందల ఏళ్ల నుంచి ఈ గ్రామంలో ఏ కుటుంబంలోనైనా తొలి సంతానానికి ఇలా గ్రామ దేవత పేరు కలిసొచ్చేలా పేర్లు పెడుతున్నారు.  

More Telugu News