ayodhya verdict: అయోధ్య తీర్పులో మీ జోక్యం ఏమిటి?.. మండిపడిన భారత్

  • అయోధ్య మా అంతర్గత విషయం
  • విద్వేషాలు సృష్టించడమే మీ పని
  • పాక్ స్పందనను తీవ్రంగా ఖండిస్తున్నామన్న రవీశ్ కుమార్

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాక్ స్పందించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. తమ అంతర్గత వ్యవహారంలో మీ జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. పాక్ స్పందనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. అయోధ్య తీర్పు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇది చట్టానికి సంబంధించినదని ఆయన అన్నారు. అన్ని వర్గాల విశ్వాసాలను చట్టం సమానంగా గౌరవిస్తుందన్నారు. విద్వేషాలు సృష్టించడమే పాక్ లక్ష్యమని ఆరోపించారు. పాక్‌ వాదన పూర్తిగా అసమంజసమని కొట్టిపడేశారు.

అయోధ్య తీర్పుపై స్పందించిన పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ మాట్లాడుతూ.. ఈ తీర్పుతో భారత్‌లో ముస్లింలకు భద్రత లేదని మరోమారు రుజువైందన్నారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవ సమయంలోనే అయోధ్యపై తీర్పు వెల్లడించడం సరికాదని అన్నారు. ఈ తీర్పు తననెంతో విచారానికి గురిచేసిందని ఖురేషీ వ్యాఖ్యానించారు.

More Telugu News