Narendra Modi: ఆ గాయానికి కర్తార్‌పూర్ కారిడార్ ఓ ఆయింట్‌మెంట్: సిద్ధూ

  • సిక్కుల కలను నెరవేర్చిన ఇరు దేశాల ప్రధానులకు ధన్యవాదాలు
  • మోదీకి,నాకు మధ్య ఉన్నవి రాజకీయ వైరుధ్యాలే
  • ప్రధానికి మున్నాభాయ్ స్టైల్‌లో హగ్ ఇస్తున్నా

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరైన పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. విభజన సమయంలో జరిగిన రక్తపాతానికి కర్తార్‌పూర్ కారిడార్ ఓ అయింట్‌మెంట్ పూత లాంటిదని అన్నారు. కారిడార్ నిర్మాణంలో తన స్నేహితుడైన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ సందర్భంగా కారిడార్ నిర్మాణానికి చొరవచూపిన ఇమ్రాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సిక్కుల కలను నెరవేర్చినందుకు ఇరు దేశాల ప్రధానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు సిద్ధూ తెలిపారు.

పది నెలల్లోనే కారిడార్ పూర్తయిందని, ఈ విషయంలో మోదీ చూపిన చొరవ మరువలేనిదని కొనియాడారు. ప్రధాని మోదీకి, తనకు మధ్య రాజకీయపరమైన భేదాభిప్రాయాలు ఉండొచ్చని, తాను తన జీవితాన్ని గాంధీ కుటుంబానికి అంకితం చేయొచ్చని పేర్కొన్న సిద్ధూ.. కారిడార్ పూర్తిచేసి సిక్కుల కలను నెరవేర్చినందుకు మోదీకి మున్నాభాయ్ ఎంబీబీఎస్ స్టైల్‌లో ఓ హగ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News