Ayodhya verdict: అయోధ్య తీర్పుపై తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్

  • భారత్‌లో మైనారిటీలకు న్యాయం జరగదని మరోమారు స్పష్టమైంది
  • తీర్పు చెప్పేందుకు సుప్రీంకోర్టు ఎంచుకున్న సమయం సరికాదు
  • భారత్‌ను హిందూదేశంగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం

అయోధ్య తీర్పుపై పొరుగుదేశం పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. సుప్రీంకోర్టు తీర్పుతో మైనారిటీలకు అన్యాయం జరిగిందని ఆక్రోశం వ్యక్తం చేసింది. భారత్‌లో మైనారిటీలకు భద్రత లేదని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరోమారు రుజువైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం పేర్కొంది. భారత్‌ను హిందూదేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించింది.  సంఘ్‌ పరివార్‌ తన హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు చరిత్రను తిరగ రాస్తోందని ఆరోపించింది. అయోధ్యపై తుది తీర్పు వెలువరించేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు ఎంచుకున్న సమయం సరికాదని పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పేర్కొన్నారు.

More Telugu News