Shiva Sena: సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజిది.. 24న అయోధ్యకు వెళుతున్నా: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే

  • ప్రతి ఒక్కరు సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించారు 
  • అద్వానీని కలిసి శుభాకాంక్షలు తెలుపుతా
  • రథయాత్రను చేపట్టిన ఘనత అద్వానిదే అన్న ఉద్ధవ్

అయోధ్య వివాదం కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. ప్రతి ఒక్కరు తీర్పును అంగీకరించారు. 24న నేను అయోధ్యను సందర్శిస్తాను. త్వరలో బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీని కలిసి శుభాకాంక్షలు తెలుపుతా. ఈ అంశంలో రథయాత్రను చేపట్టిన ఘనత అద్వానిదే.. ఆయన్ను తప్పకుండా కలిసి ఆశీర్వాదాన్ని పొందుతా’ అని ట్వీట్ చేశారు.

ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా సీఎం పదవి తమకు కావాలని డిమాండ్ చేయడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో థాకరే అద్వానీని కలిసి ఆశీర్వాదం తీసుకుంటాననటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

More Telugu News