Nara Lokesh Letter to Speaker: లోకేశ్ లేఖపై మంత్రి వెల్లంపల్లి విమర్శలు

  • లోకేశ్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి 
  • స్పీకర్ పదవిని దిగజార్చిన ఘనత గత సీఎం చంద్రబాబు ప్రభుత్వానిదే  
  • జగన్ విలువలతో కూడిన రాజకీయం చేసే గొప్ప వ్యక్తి

టీడీపీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారామ్ కు బహిరంగ లేఖ రాయడంపై మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. లోకేశ్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని, బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. స్పీకర్ పదవిని దిగజార్చిన ఘనత గత సీఎం చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు. శాసన సభ్యులను సంతల్లో పశువుల్లా కొన్నా, అప్పటి స్పీకర్ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

లోకేశ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ విలువలతో కూడిన రాజకీయం చేసే గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. జగన్ తలచుకుంటే లోకేశ్ సహా అందరూ వైసీపీలోకి వస్తారన్నారు. హాయ్ లాండ్ భూములను కొట్టేసేందుకు తండ్రీకొడుకులు కుట్రలు చేశారంటూ చంద్రబాబు, లోకేశ్ లపై స్పీకర్ తమ్మినేని ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పరుష పదజాలంతో స్పీకర్ కు  బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.

More Telugu News