Ruler: 'రూలర్' చిత్రంలో బాలకృష్ణ క్రేజీ లుక్... చూశారా?

  • త్వరలోనే టీజర్ విడుదల
  • యంగ్ లుక్ తో అదరగొడుతున్న బాలయ్య
  • డిసెంబరు 20న రిలీజ్ అవుతున్న చిత్రం

నందమూరి బాలకృష్ణ హీరోగా, సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ కు ఇప్పటికే విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్య మరింత యంగ్ లుక్ తో క్రేజీగా కనిపిస్తున్నాడు. త్వరలోనే టీజర్ అంటూ విడుదలైన ఈ పోస్టర్ లో ఎన్బీకే ఓ పాటకు సంబంధించిన స్టిల్ లో ట్రెండీ దుస్తుల్లో దర్శనమిస్తున్నాడు. కాగా, సి.కల్యాణ్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న 'రూలర్' చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News