Andhra Pradesh: ఏపీలో భూమి శిస్తు వసూలుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదన

  • గతంలో ఎన్టీఆర్ హయాంలో రద్దయిన భూమి శిస్తు
  • మళ్లీ తెరపైకి తెస్తోన్న వైసీపీ సర్కారు
  • రైతుల్లో భరోసా కలుగుతుందంటున్న ప్రభుత్వం

గతంలో రద్దయిన భూమి శిస్తు విధానాన్ని వైసీపీ సర్కారు మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రతిపాదిస్తోంది. భూమి శిస్తు చెల్లించిన రైతులకు యాజమాన్య హక్కుల పరంగా భరోసా ఉంటుందన్నది రెవెన్యూ మంత్రిత్వ శాఖ అభిప్రాయంగా తెలుస్తోంది.

గతంలో ఎన్టీఆర్ హయాలో భూమి శిస్తు విధానాన్ని రద్దు చేశారు. భూమి శిస్తు చెల్లించడం ద్వారా భూమికి తాము హక్కుదారులమన్న భావన రైతుల్లో కలుగుతుందని, దీని ద్వారా ఆదాయం ఆర్జించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. సీఎంకు ప్రతిపాదనలు పంపి ఆయన ఆమోదం వచ్చిన తర్వాత శిస్తు వసూలు విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. కాగా, శిస్తు ఒక ఎకరానికి రూ.50 లోపు ఉండే అవకాశముంది.

More Telugu News