Jyothika: జ్యోతిక 'జాక్ పాట్' విడుదల తేదీ ఖరారు

  • జ్యోతిక ప్రధాన పాత్రధారిగా 'జాక్ పాట్'
  • కీలకమైన పాత్రలో రేవతి
  • ఈ నెల 21వ తేదీన విడుదల

సూర్య సొంత బ్యానర్లో జ్యోతిక ప్రధాన పాత్రధారిగా 'జాక్ పాట్' నిర్మితమైంది. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాలో రేవతి కూడా ఒక కీలకమైన పాత్రను పోషించింది. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, పూర్తి వినోదభరితంగా రూపొందింది. యోగిబాబు .. సముద్రఖని .. రాజేంద్రన్ .. మన్సూర్ అలీఖాన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. కథల విషయంలో జ్యోతిక ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, రీ ఎంట్రీలో దూసుకుపోతోంది. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.  

More Telugu News