Loksatta: స్థానిక వివాదాన్ని జాతీయ సమస్యగా మార్చారు: 'అయోధ్య' తీర్పుపై లోక్ సత్తా జేపీ వ్యాఖ్యలు

  • అయోధ్య భూమి హిందువులదేనంటూ సుప్రీం తీర్పు
  • ట్విట్టర్ లో స్పందించిన జయప్రకాశ్ నారాయణ
  • ఈ అధ్యాయాన్ని ముగిద్దాం అంటూ పిలుపు

దశాబ్దాల తరబడి సమస్యాత్మకంగా మారిన అయోధ్య భూవివాదం కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులదేనని అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పులో పేర్కొంది. దీనిపై లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధినేత జయప్రకాశ్ నారాయణ స్పందించారు.

"హిందువులు కానీ, ముస్లింలు కానీ... అన్ని వర్గాల ప్రజలు అయోధ్య వివాదంలో అనవసర రాద్ధాంతానికి ముగింపు కోరుకున్నారు. ఒక స్థానిక భూవివాదం జాతీయ సమస్యగా మారిందంటే అందుకు కారణం పక్షపాత రాజకీయాలు, కొన్ని గ్రూపుల అస్థిత్వ పోరాటం. ఇక ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. మన యువత భవిష్యత్ పై దృష్టి సారిద్దాం" అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News