డబ్బింగ్ పనులు కానిచ్చేస్తున్న 'ప్రతిరోజూ పండగే'

- మారుతి నుంచి 'ప్రతిరోజూ పండగే'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- కీలకమైన పాత్రలో సత్యరాజ్
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నాడు. కుటుంబం అంటే ఒక కప్పు కింద కొంతమంది కలిసి ఉండటం కాదు .. ఒకరి మనసులో ఒకరు ఉండటం. అనుబంధాల కోవెలే అసలైన కుటుంబం అని చాటిచెప్పే కథ ఇది. ఈ సినిమాలో తేజూకి తాత పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆయన పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా, తేజూకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.