Supreme Court: రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న హిందువుల విశ్వాసం నిర్వివాదాంశం: సుప్రీంకోర్టు

  • తీర్పు చదువుతోన్న గొగోయ్
  • మసీదును ఎవరు, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది
  • రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తోంది. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న హిందువుల విశ్వాసం నిర్వివాదాంశమని సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ అన్నారు. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని చెప్పారు. గతంలో ఈ వివాదాస్పద స్థలంలో రెండు మతాలూ ప్రార్థనలు చేసేవని తెలిపారు.

ఈ కేసు దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించిందని గొగోయ్ అన్నారు. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదని చెప్పారు. మసీదును ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని ఇప్పటికే హైకోర్టు చెప్పిందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందన్నారు.

More Telugu News