kanipakam: కాణిపాకం ఆలయం సహా ఐదు దేవాలయాల పాలకమండళ్ల రద్దు

  • నూతన సభ్యుల నియామకానికి వీలుగా నిర్ణయం
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • రిజర్వేషన్ల అమలుతో కొత్త కమిటీల ఏర్పాటుకు ఆదేశం

రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సన్నిధానం, చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంతో పాటు మొత్తం ఐదు ఆలయాల పాలక మండళ్లను రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రద్దయిన వాటిలో తలకోన సిద్ధేశ్వరాలయం, సురుటుపల్లె పల్లికొండేశ్వరాలయం, నగరి దేశమ్మ ఆలయం, కుప్పంలోని శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాల పాలక మండళ్లు ఉన్నాయి.

అన్ని నామినేటెడ్‌ పోస్టుల్లోనూ మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు యాభై శాతం స్థానాలు కేటాయించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే  పాలక మండళ్ల నియామకం జరిగిపోవడంతో ఈ నిబంధన అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎక్స్‌ అఫిషియో సభ్యులు మినహా మిగిలిన వారి పదవులు రద్దయినట్టే. వీటి స్థానంలో కాణిపాకం మినహా మిగిలిన ఆలయాలకు కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News