Rajasri: నేను సినిమాల్లోకి రావడం అలా జరిగింది: సీనియర్ హీరోయిన్ రాజశ్రీ

  • బాలనటిగా సినీ రంగ ప్రవేశం
  • వరుసగా వచ్చిన చెల్లెలి పాత్రలు  
  • అందాల రాశిగా మంచి గుర్తింపు 

తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన అలనాటి అందాల తారల్లో రాజశ్రీ ఒకరు. అలనాటి అగ్రకథానాయకులతో ఆమె కాంతారావుతో ఎక్కువ సినిమాలు చేశారు. జానపద చిత్రాల్లో అందాల కథానాయికగా అలరించిన ఆమె, నటనకి దూరమై 40 ఏళ్లు అవుతోంది.

 తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .." చిన్నతనం నుంచి నాకు నటన పట్ల ఆసక్తి ఎక్కువ. నేను ఒక డ్రామాలో నటిస్తుండగా ఏవిఎమ్ స్టూడియోస్ వారు చూసి, మా అమ్మానాన్నలను సంప్రదించారు. అలా సినిమా కోసం నేను మొదటిసారిగా ఏవీఎమ్ స్టూడియోలో అడుగుపెట్టాను. ఆ సినిమాలో చిన్నప్పటి జమున పాత్ర కోసం నన్ను తీసుకున్నారు.

తర్వాత చిత్తూరు నాగయ్యగారి 'భక్త రామదాసు' చిత్రంలో చిన్నప్పటి 'కమల' పాత్రలోను నటించాను. టీనేజ్ లోకి అడుగు పెడుతుండగా చెల్లెలి పాత్రలు ఎక్కువగా చేస్తూ వెళ్లాను. ఆ తరువాత ఎమ్. జి. రామచంద్రన్ గారి 'కలై అరసి' సినిమాతో తొలిసారి కథానాయికగా చేశాను. ఆ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News