కాబోయే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కలిసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

Fri, Nov 08, 2019, 04:08 PM
  • ఢిల్లీలో ఎస్ఏ బాబ్డేను కలిసిన యార్లగడ్డ
  • తెలుగు సాహిత్య చరిత్ర గ్రంధాల బహూకరణ
  • అమరావతి, విశాఖల్లో పర్యటించాలని విన్నపం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ రోజు ఢిల్లీలో జస్టిస్ ఎస్ఏ బాబ్డేతో భేటీ అయిన యార్లగడ్డ... ఆయనకు తెలుగు సాహిత్య చరిత్ర గ్రంధాలను బహూకరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో అమరావతి, విశాఖపట్నంలను సందర్శించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ కాబోయే ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్ధించారు. దానికి జస్టిస్ బాబ్డే  సానుకూలంగా స్పందిస్తూ సమయానుకూలంగా వస్తానని హామీ ఇచ్చారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha