నడిరోడ్డుపై మహిళా డీసీపీని తరుముకుంటూ వచ్చి కలకలం రేపిన లాయర్లు.. సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు !

Fri, Nov 08, 2019, 11:14 AM
  • ఇటీవల ఢిల్లీ పోలీసులు, లాయర్లకు మధ్య చెలరేగిన ఘర్షణ
  • డీసీపీని రక్షించిన ఇద్దరు పోలీసులు
  • లాయర్ల తీరుపై విమర్శలు
ఇటీవల ఢిల్లీ పోలీసులు, లాయర్లకు మధ్య చెలరేగిన ఘర్షణ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో మహిళా డీసీపీపై లాయర్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

ఓ మహిళా డీసీపీని కొందరు లాయర్ల గుంపు వెంటాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. చివరకు మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది ఆమెకు రక్షణగా నిలిచి, ఘర్షణ చెలరేగిన చోటు నుంచి బయటకు తీసుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు కనపడ్డాయి.

లాయర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. మహిళా డీసీపీని బయటకు తీసుకొస్తున్న సమయంలో తన భుజానికి బలమైన గాయమైందని ఓ పోలీసు తెలిపారు. ఆ డీసీపీ సబార్డినేట్‌లలో ఒకరి పిస్టల్‌ మిస్ అయిందని చెప్పారు. డీసీపీని తరమడమే కాకుండా లాయర్లు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. వాటిని పోలీసులు ఆర్పేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించకపోతే ఆ మంటలు వ్యాపించి భారీ ప్రమాదం జరిగేది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha