క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో కార్తీ నుంచి రానున్న 'తంబి'

08-11-2019 Fri 09:28
  • ప్రధాన పాత్రధారులుగా కార్తీ - జ్యోతిక 
  • దర్శకుడిగా జీతూ జోసెఫ్ 
  • డిసెంబర్ 20న విడుదల చేసే ఆలోచన

కార్తీ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'ఖైదీ' భారీ విజయాన్ని నమోదు చేసింది. కార్తీ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. తెలుగు .. తమిళ భాషలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాంటి కార్తీ నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తమిళంలో కామెడీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా రూపొందింది.

కార్తీ .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, 'తంబి' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు సమాచారం. 'దృశ్యం' మలయాళ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. అందువలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. సత్యరాజ్ .. అభిరామి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, తెలుగులోను విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు.