Kamal Haasan: సరికొత్త 'సేనాపతి' ఇలా... స్పెషల్ లుక్ ను విడుదల చేసిన శంకర్!

  • 'భారతీయుడు'కి కొనసాగింపుగా సీక్వెల్
  • హీరోయిన్ గా నటిస్తున్న కాజల్
  • అలరిస్తున్న కమల్ లుక్

సేనాపతి... శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు' చూసిన వారెవరికైనా గుర్తుండిపోయే పాత్ర అది. లంచగొండి తనంపై పోరాడే స్వాతంత్ర్య సమరయోధుడిగా కమల్ నటన అద్భుతంగా సాగిందా చిత్రంలో. ఇక, తాజాగా ఆ సినిమాకు కొనసాగింపుగా భారతీయుడు-2 తీస్తున్న శంకర్, అందులోని సేనాపతి పాత్రకు సంబంధించిన స్పెషల్ లుక్ ను విడుదల చేశారు.

ఎత్తుగా కనిపిస్తున్న ఓ కోటపై నిలబడివున్న కమల్ ఇందులో కనిపిస్తుండగా, ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. తొలి భాగంలోని డ్రస్సింగ్ స్టయిలే ఇందులోనూ కనిపిస్తోంది. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ నటిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

More Telugu News