Hero Moto Corp: బీఎస్-6 ప్రమాణాలతో హీరో మోటోకార్ప్ తొలి బైక్ విడుదల

  • ఢిల్లీ మార్కెట్లోకి ‘స్ల్పెండర్ ఐస్మార్ట్’ బైక్
  • బీఎస్-6 స్టాండర్డ్ తో బైక్ లాంచ్ ఘనత హీరో కంపెనీదే
  • ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.64,900

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త మోడల్స్ తో ప్రత్యర్థి కంపెనీలకు సవాల్ విసురుతోంది. బైక్ ల మార్కెట్లోకి తొలిసారిగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాన్ని విడుదల చేసిన తొలి కంపెనీగా ఘనతను సొంతం చేసుకుంది. ఈరోజు హీరో మోటోకార్ప్ ‘స్ల్పెండర్ ఐస్మార్ట్’ బీఎస్-6 బైక్ ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్-6 ప్రమాణాలకనుగుణంగా ఈ బైక్ ఉంటుంది.

ఈ వాహనం స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 110 సీసీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్ దీని సొంతం. ఇది 7,500 ఆర్ పీఎం వద్ద 9 బీహెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. 5,500 ఆర్ పీఎం వద్ద 9.89 ఎన్ ఎం టార్క్ ను విడుదల చేస్తుంది. పాత మోడల్ తో పోలిస్తే కొత్త మోడల్లో స్వల్ప మార్పులు చేశారు. వీల్ బేస్, ఫ్రంట్ సస్పెన్షన్ లో మార్పులున్నాయి.

 సెల్ఫ్ డ్రమ్ కాస్ట్, సెల్ఫ్ డిస్క్ కాస్ట్ అనే రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్ షోరూంలో రూ.64,900గా ఉంది. టెక్నో బ్లూ బ్లాక్, స్పోర్ట్స్ రెడ్ బ్లాక్, ఫోర్స్ సిల్వర్, హెవీ గ్రే రంగుల్లో బైక్ లభ్యమవుతుంది. ఈ సందర్భంగా సంస్థ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ... కొత్త బీఎస్ 6 ఇంజిన్ ను జైపూర్ లోని సీఐటీలో అభివృద్ధి చేశామన్నారు. బైక్ పనితీరు, సామర్థ్యం రైడింగ్ ఎక్స్ పీరియన్స్, స్టైల్ ను అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. తొలుత ఢిల్లీలో ఈ బైక్ ల అమ్మకాలు ప్రారంభించి వాటిపై ప్రజల స్పందనను తెలుసుకున్న తర్వాత దేశ వ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభిస్తామన్నారు.

More Telugu News