Agri Gold depositors: అగ్రిగోల్డ్ బాధితులకిచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు: మంత్రి బొత్స

  • విజయనగరంలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ
  • గత ప్రభుత్వాలు మాట ఇచ్చి తప్పాయన్న బొత్స
  • మరికొన్ని విడతల్లో చెల్లింపులు చేస్తామని వెల్లడి

ఇటీవల తమ ప్రభుత్వంపై వస్తోన్నవిమర్శలను తిప్పికొడుతూ.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటను తమ సీఎం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని చెప్పారు. విజయనగరంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఆర్థిక సాయం కింద చెక్కుల పంపిణీ చేశారు.

పదివేల రూపాయలలోపు డిపాజిట్ చేసిన జిల్లాలోని 57,941 మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులకు రూ.36.99 కోట్ల విలువైన చెక్కులు అందజేశారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. మొదటి విడతగా పదివేల రూపాయలు పంపిణీ చేస్తున్నామన్నారు. రెండో విడతలో మరో పదివేల రూపాయలు, అనంతరం మిగిలింది చెల్లిస్తామన్నారు. గత ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ బాధితులకు మాట ఇచ్చి తప్పాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వారి సమస్యలను తీర్చేందుకు చర్యలు ప్రారంభించిందన్నారు.

More Telugu News