టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు స్వల్ప అస్వస్థత

07-11-2019 Thu 14:09
  • పీఏసీ భేటీ సమయంలో అస్వస్థతకు గురైన పయ్యావుల
  • అసెంబ్లీలోని డిస్పెన్సరీలో చికిత్స
  • స్వల్ప అస్వస్థతేనని చెప్పిన డాక్టర్లు
టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలో పీఏసీ భేటీ జరుగుతున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. సమావేశం జరుగుతుండగా ఆయనకు వాంతులయ్యాయి. వెంటనే ఆయనను అసెంబ్లీలోని డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. వైద్య చికిత్స అనంతరం ఆయన కొంతమేర కోలుకున్నారు. అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు మెరుగైన వైద్యం కోసం ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు.